సన్ రైజర్స్ కు సవాల్ : హైదరాబాద్  VS పంజాబ్

ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కు అన్నట్టుగా ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌ లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కీలక సవాల్‌కు సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్‌‌‌‌ అవకాశాలకు సంక్లిష్టం చేసుకున్న సన్‌ రైజర్స్‌‌‌‌  సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం జరిగే పోరులో కింగ్స్‌‌‌‌ లెవెన్‌ పంజాబ్‌ తో తలపడనుంది. భీకరఫామ్‌ లో ఉన్న ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌ వార్నర్‌‌‌‌కు ఈ సీజన్‌ లో ఇదే ఆఖరి మ్యాచ్‌ . వరల్డ్‌‌‌‌కప్‌ ప్రిపరేషన్స్‌‌‌‌ కోసం ఆస్ట్రేలియా బయల్దేరనున్న వార్నర్‌‌‌‌.. పంజాబ్‌ పై పంజా విసరాలని భావిస్తున్నాడు. సన్‌ రైజర్స్‌‌‌‌, పంజాబ్‌ ఇప్పటి వరకు చెరో పదకొండు మ్యాచ్‌ లాడి ఐదు విజయాలు, ఆరు పరాజయాలు ఖాతాలో వేసుకున్నాయి. చెరో పది పాయింట్లతో సమంగా ఉన్నాయి. మెరుగైన రన్‌ రేట్‌ తో సన్‌ రైజర్స్‌‌‌‌ నాలుగో ప్లేస్‌ లో ఉండగా, పంజాబ్‌ ఐదో ప్లేస్‌ లో నిలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ ల్లో  నెగ్గిన జట్లు మరే లెక్కలతో పని లేకుండా ప్లేఆఫ్స్‌‌‌‌కు చేరుకోనుంది. దాంతో, ఈ పోరు రెండు జట్లకు కీలకం కానుంది.

వార్నర్‌ ఫినిషింగ్‌ ఇస్తాడా?….

బాల్‌ ట్యాంపరింగ్‌‌‌‌ ఉదంతంలో ఏడాది నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌‌‌‌ ఐపీఎల్‌ లో చెలరేగి ఆడుతున్నాడు. లీగ్‌‌‌‌లో ఇప్పటికే 611 పరుగులతో టాప్‌ స్కోరర్‌‌‌‌గా ఉన్నాడు. సెకండ్‌ స్కోరర్‌‌‌‌ అయిన వార్నర్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ జానీ బెయిర్‌‌‌‌స్టో (445) ఇప్పటికే ఇంగ్లండ్‌ కు వెళ్లిపోయాడు. ఈ పోరు తర్వాత వార్నర్‌‌‌‌ కూడా వైదొలిగితే సన్‌ రైజర్స్‌‌‌‌ తమ ఓపెనింగ్‌‌‌‌ జోడీని మిస్‌ కానుంది. ఇది చివరి రెండు మ్యాచ్‌ లో హైదరాబాద్‌ బ్యాటింగ్‌‌‌‌పై తీవ్ర ప్రభావం చూపే చాన్సుంది.లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌ కాబట్టి తనదైన స్టయిల్‌ లో ఫినిషింగ్‌‌‌‌ ఇవ్వాలని వార్నర్‌‌‌‌ భావిస్తున్నాడు. కానీ, అతనొక్కడే ఆడితే సరిపోదు. మిగతా ప్లేయర్లు కూడా బాధ్యత తీసుకునేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌ ల్ లో చెలరేగి ఆడిన మనీష్‌ పాండే ఎట్టకేలకు ఫామ్‌ లోకి రావడం జట్టు కు శుభసూచకమే. కానీ, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. సీజన్‌ లో బరిలోకి దిగిన ఐదు ఇన్నింగ్స్‌‌‌‌లో కలిపి కేన్‌ 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌ తో అయినా అతను జట్టు ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఇక, మనీష్‌ పాండే టచ్‌ లోకి రావడం కాస్త ఊరట కలిగించే విషయమే అయినా.. మిడిలార్డర్‌‌‌‌లో బాధ్యత తీసుకునే వారు కరువయ్యారు. దీపక్‌ హుడా, విజయ్‌ శంకర్‌‌‌‌,యూసుఫ్‌‌‌‌ పఠాన్‌ తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. అలాగే, గత సీజన్లకు భిన్నంగా రైజర్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చాలా పేలవంగా కనిపిస్తోంది. జోరుమీదున్న క్రిస్‌ గేల్‌ , లోకేశ్ రాహుల్‌ ను అడ్డుకోవాలంటే బౌలర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.

పంజాబ్‌ పరిస్థితీ అంతే….

గెలుపోటముల్లో  హైదరాబాద్‌ తో సమానంగా ఉన్న పంజాబ్‌ టీమ్‌ లో సమస్యలు కూడా రైజర్స్‌‌‌‌ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఆ జట్టు కూడా టాపార్డర్‌‌‌‌పై తీవ్రంగా ఆధారపడుతోంది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ (444 రన్స్‌‌‌‌), లోకేశ్‌‌‌‌ రాహుల్‌ (441రన్స్‌‌‌‌) జట్టు విజయాలో కీలకంగా ఉన్నారు. వీరిద్దరు సత్తా చాటిన మ్యాచ్‌ ల్ లో పంజాబ్‌ జయకేతనం ఎగురవేస్తోంది. మయాంక్‌ అగర్వాల్‌ (262)డేవిడ్‌ మిల్లర్‌‌‌‌ (202), సర్ఫరాజ్‌ ఖాన్‌ (180)ఫర్వాలేదనిపించినా కీలక సమయాల్లో బాధ్యత తీసుకోవడంలో విఫలమయ్యారు. అయితే, బెంగళూరుతో చివరి మ్యాచ్‌ లో సత్తా చాటిన యువఆటగాడు నికోలస్‌ పూరన్‌ పై కెప్టెన్‌ అశ్విన్‌ భరోసా ఉంచాడు. పంజాబ్‌ బౌలింగ్‌‌‌‌ మాత్రం పదునుగా ఉంది. అశ్విన్‌ , పేసర్‌‌‌‌ షమీ ప్రత్యర్ థులకు చెమటలు పట్టిస్తు న్నారు. మురుగన్‌ అశ్విన్‌ కూడా రాణిస్తున్నాడు.

జట్లు (అంచనా)…

సన్‌ రైజర్స్‌ : కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌ ), డేవిడ్‌వార్నర్‌‌‌‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌‌‌‌, షకీబల్‌హసన్‌ , దీపక్‌ హుడా, సాహా (కీపర్‌‌‌‌), రషీద్‌ ఖాన్‌ ,భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌, సిద్దార్థ్‌‌‌‌ కౌల్‌ /సందీప్‌ ,ఖలీల్‌ .

పంజాబ్‌ : లోకేశ్‌‌‌‌ రాహుల్‌ , క్రిస్‌ గేల్‌ , మయాంక్‌ అగర్వాల్‌ , మిల్లర్‌‌‌‌, పూరన్‌ (కీపర్‌‌‌‌), కరుణ్‌ నాయర్‌‌‌‌/మన్‌ దీప్‌ సింగ్‌‌‌‌, ఆర్‌‌‌‌. అశ్విన్‌ (కెప్టెన్ ), విల్జోన్‌ , మురుగన్‌ , అంకిత్‌ , షమీ.

Latest Updates