గోపీచంద్ “చాణక్య” లుక్ వచ్చేసింది

కోలీవుడ్ డైరెక్టర్ తిరు ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా చాణ‌క్య. బుధవారం గోపిచంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. డైరెక్టర్ తిరు ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ..ఈ మూవీలోని గోపీచంద్ పిక్ ను పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే గోపీచంద్ సార్. పుట్టినరోజు సందర్భంగా ఈ గిఫ్ట్ మీ కోసం అని ట్వీట్ చేశాడు తిరు. ఇందులో గోపిచంద్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. చాణ‌క్య  స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండ‌గా, ఇందులో గోపిచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైన‌ప్ప‌టికి, ఆ మ‌ధ్య‌లో గోపిచంద్ కు యాక్సిడెంట్ కావడంతో షూటింగ్ వాయిదా ప‌డింది. రీసెంట్‌గా షూటింగ్ మ‌ళ్ళీ మొద‌లు పెట్టారు.

అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్.  ఈ ఏడాదిలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తుంది.

Latest Updates