ఈ సీజన్ ఐపీఎల్‌లో సచిన్ కొడుకు ఆడే చాన్స్!

ముంబై టీమ్​లో అర్జున్​ టెండూల్కర్​

అబుదాబి: క్రికెట్​ లెజెండ్​ సచిన్​ టెండూల్కర్​ కుమారుడు అర్జున్​​.. ఐపీఎల్​లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్​కు నెట్​ బౌలర్​గా సేవలందిస్తున్న అర్జున్ త్వరలో అదే టీమ్​కు ఆడే చాన్స్​ కూడా ఉంది. నెట్‌ బౌలర్‌‌గా అర్జున్​ను యూఏఈకి తీసుకెళ్లిన ముంబై  ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. అయితే, క్వారంటైన్​ పూర్తి చేసుకున్న అర్జున్​.. ముంబై బౌలర్లతో కలిసి స్విమ్మింగ్​ ఫూల్​లో సేద తీరుతున్న ఫొటో వైరల్​ కావడంతో విషయం బయటకు పొక్కింది. ఒకవేళ లీగ్​ టైమ్​లో ఏ ప్లేయరైనా గాయపడితే ఆ ప్లేస్​లో అర్జున్‌ను తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

For More News..

శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డి సరెండర్‌‌‌‌

Latest Updates