చివరి దశకు వ్యాక్సీన్ తయారీ

  • మనుషులపై ట్రయల్స్ చేయనున్న ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు
  • సక్సెస్ అయితే ఈ ఏడాదిలోపే అందుబాటులోకి

లండన్: జనాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సీన్ ఎప్పుడొస్తుందా ప్రపంచం అంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సీన్ కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్న ఆక్స్ ఫర్డ్ లోని జెన్నర్ ఇన్​స్టిట్యూట్ సైంటిస్టులు .. ఈ ఏడాదిలోపే టీకా అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. నేడు(గురువారం) మొదటి సారి మనుషులపై వాక్సీన్ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది సక్సెస్ అయితే ఈ ఏడాదిలోపే వ్యాక్సీన్ టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. వర్సిటీ సైంటిస్ట్ క్రిస్ విట్టి మాట్లాడుతూ.. ఇంతటి భయంకరమైన వైరస్ కు వ్యాక్సీన్ ను ఏడాదిలోగా కనుగొనడం గొప్పవిషయమన్నారు. వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతం కావడానికి 80 శాతం అవకాశం ఉందని రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ అంచనా వేశారు. ప్రయోగం విజయవంతం అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కనీసం ఒక మిలియన్ వ్యాక్సీన్ టీకాలను అందుబాటులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

జర్మనీలోనూ వ్యాక్సీన్ ట్రయల్స్
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సీన్ ప్రయోగం నిర్వహించనున్నట్లు జర్మనీ రెండ్రోజుల కిందటే ప్రకటించింది. అమెరికా, జర్మనీల సంస్థలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ఆర్​ఎన్​ఏ వ్యాక్సీన్ ను.. మనుషులపై ట్రయల్ చేయనున్నట్లు వెల్లడించింది.

coronavirus, vaccine, by end of the year, trails

Latest Updates