మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. దాదాపు సిటీలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల ఈదురుగాలులతో వాన పడుతోంది. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనంతోనే వర్షాలు పడుతున్నాయంటోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. సిటీలోని అబిడ్స్, చార్మినార్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో భారీగానే వర్షం పడుతోంది.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 13 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.

Latest Updates