వీడియోగేములు ఆడుకో జగన్ : చంద్రబాబు

సీఎం జగన్ కు జ్ఞానం లేదని అందుకే వీడియోగేములు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అలాంటి వ్యక్తి సీఎం అవ్వడం సమాజానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు.

 జగన్ ప్రెస్ మీట్ పెట్టారా

సీఎంజగన్ ప్రెస్ మీట్ పై మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో అల్లాడుతుంటే..సింపుల్ గా ఎలా మాట్లాడారని అన్నారు. కరోనా వైరస్ పై జగన్ కు అవగాహనలేదని..వైరస్ వస్తే ఏం చేయాలి. ఏం చేయకూడదనే విషయాల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. వైరస్ పట్ల ప్రజలందరూ అయోమయానికి గురవుతుంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడారా అని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ వైరస్ గా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా  ప్రస్తావించారు.

కరోనా వల్లే ఎన్నికల వాయిదా 

కరోనా వైరస్ వల్లే ఎన్నికలు వాయిదా వేశారని చంద్రబాబు అన్నారు. కరోనా వైరస్ పై ఆయా దేశాలకు చెందిన ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట మార్చారని చెప్పారు. అందుకు ఊదాహరణగా ఇరాన్ మంత్రి ముందురోజు కరోనా లేదని, మరుసటి రోజు కరోనా సోకి ఆస్పత్రి పాలైనట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సైతం కరోనా పట్ల మాటమార్చి జాగ్రత్తలు చెప్పారని అన్నారు.

ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదు

ప్రపంచంలో, సమాజంలో కరోనా వైరస్ పట్ల ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ప్రజలు కరోనా పట్ల ప్యానిక్ అవుతున్నారని..మనదేశంలో కరోనా సోకితే చికిత్స చేసేందుకు ఆస్పత్రులు, బెడ్స్, వ్యాక్సిన్ లు లేవని  అన్నారు. కరోనా వైరస్ తో ప్రపంచంలో ఏం జరుగుతుందో అయోమయంగా ఉందని చంద్రబాబు మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

Latest Updates