నిరసన దీక్షలో బాబు మెయిన్ డిమాండ్లివే

ఏపీలో ఇసుక కొరతతో నిర్మాణరంగం కుదేలయ్యింది. పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు. కొందరైతే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటన్నింటిని పరిశీలించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ రోజు నిరసన దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షలో భాగంగా ఆయన ప్రభుత్వానికి మూడు డిమాండ్లను పెట్టారు. అందులో మొదటిది, తమ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం, రెండోది ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ .25 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించడం, మూడోది గత 5 నెలలుగా జీవనోపాధి కోల్పోయిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి రూ .10 వేల పరిహారం ఇవ్వడం.

ఇలా తన మూడు డిమాండ్లు లక్ష్యంగా ఈ రోజు ఆయన నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా చంద్రబాబు 12 గంటల పాటు దీక్షలో కూర్చొనున్నారు. మొదట ఈ దీక్షను చంద్రబాబు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ, అక్కడ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో నిరసన దీక్షను దర్నాచౌక్‌కు మార్చారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా కొన్నిరోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

Latest Updates