వాచ్ మేన్ మోడీకి రోజుకో సూటు అవసరమా? : చంద్రబాబు

మోడీ ఖరీదైన బట్టలు వేసుకుంటారు

నేను గాంధీలాగా సింపుల్ గా ఉంటాను : చంద్రబాబు

విజయవాడ : గుంటూరు సభలో ప్రధానమంత్రి మోడీ చేసిన విమర్శలను తప్పుపట్టారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. తన కుటుంబం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ప్రజల మనిషిని అని చెప్పారు. దేశానికి వాచ్ మేన్ లాగా ఉంటానని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రోజుకో ఖరీదైన సూటు, బూటు వేసుకుంటారని అన్నారు. వాచ్ మేన్ లాగా ఉండాల్సిన వ్యక్తికి.. కోట్ల విలువైన అలాంటి వేషధారణ అవసరమా అని ప్రశ్నించారు. గాంధీ సింపుల్ గా ఉంటారని చెప్పిన చంద్రబాబు.. తాను కూడా అలాగే సింప్లిసిటీని ఇష్టపడతానని చెప్పారు. ఎప్పుడు పచ్చ షర్ట్ వేసుకుంటానని.. ఇవాళ నిరసన తెలుపుతున్నా కాబట్టి.. నల్ల షర్ట్ వేసుకున్నా అని వివరణ ఇచ్చారు.

Latest Updates