భోగిమంటల్లో జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు

అమరావతిలో నిరసనలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితీ ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర భోగి మంటలు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. రాజధానిపై జీఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటి ఇచ్చిన నివేదిక పేపర్లను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ తప్ప మిగితా పార్టీలన్ని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయని చెప్పారు చంద్రబాబు. ఒక్క వ్యక్తి నిర్ణయాల వల్ల ఏపీ దారుణంగా దెబ్బతింటుందని చెప్పారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్నారు.

Latest Updates