ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్

అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ ఫ్రెష్‌లో కిలో ఉల్లి రూ. 200కు అమ్ముతున్నారని.. మేం మాత్రం ప్రభుత్వం తరపున కిలో ఉల్లి రూ. 25లకే అందజేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు ‘హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదు. మేం దాన్ని అమ్మెశాం. మీరు హెరిటేజ్ ఫ్రెష్ మాదని నిరూపిస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి, అపోజిషన్ లీడర్ పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ మీరు నిరూపించలేకపోతే మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు’ అని అన్నారు.

Latest Updates