కేసీఆర్ కు లేని ఎన్నికల కోడ్ నాకెందుకు? : చంద్రబాబు

బీహార్, జార్ఖండ్ లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల విభజన వేరు, ఆంధ్రప్రదేశ్ విభజన వేరన్నారు. ఏపీ విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. మల్లన్నసాగర్, కాళేశ్వరంపై రివ్యూ చేస్తే తప్పు లేనిది… తాము పోలవరంపై రివ్యూ చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా అని ప్రశ్నించారు.తాను పోలవరంకు వెళ్తే తప్పేంటని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని ఆయన అన్నారు. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని విమర్శించారు చంద్రబాబు.

Latest Updates