సభలో నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నరు

అమరావతి: బిల్లులపై మాట్లాడేందుకు తమకు కనీస సమయం ఇవ్వలేదని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. సభలో తనను తిట్టడమే జగన్ టీం పనిగాపెట్టుకున్నారని చెప్పారు.  స్పీకర్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ప్రతిపక్షాన్ని బయటకు నెట్టామన్నారని అన్నారు. ఏపీ సీఎం జగన్ ఓ ఉన్మాది ముఖ్యమంత్రి అని… సభలో దుర్మార్గంగా ప్రవర్తించారని చెప్పారు. లైవ్ లు కట్ చేసి టీవీ ప్రసారాలు ఎందుకు నిలిపివేసారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో కూడా ఇంత అరాచకం చూడలేదని తెలిపారు.  వైవీ సుబ్బారెడ్డి గ్యాలేరీలో ఎందుకు కూర్చున్నారని.. ఎమ్మెల్సీ లను ప్రలోభాలకు గురిచేశారని… గూండాలుగా,బజారు రౌడీలుగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు.

కౌన్సిల్ చైర్మన్ ను ఆయన రూంలో కొట్టేందుకు వైసీపీ మంత్రులు ప్రయత్నించారని అన్నారు చంద్రబాబు. తీవ్రవాద గ్రూప్ లనుంచి తీసుకు వచ్చి సీతక్క, పోతుల సునీతకు అవకాశం ఇచ్చామని… పోతుల సునీతకైతే రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని.. ఓడిపోతే ఎమ్మెల్సీ ని చేసామని చెప్పారు… కౌన్సిల్ గ్యాలెరీలో కూర్చుంటే తనను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారని అన్నారు చంద్రబాబు.

Latest Updates