సీఎం అయితే ప్రజల దగ్గర ఉన్న బంగారం కూడా దోచేస్తాడు: లోకేష్

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థా నాలను గెలిచి, దేశ ప్రధాని ఎవరవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయిస్తారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నా రు. బుధవారం విశాఖపట్నం , విజయనగరం జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండి పడ్డారు. విభజన హామీలపై మోడీ నమ్మిం చి మోసం చేశారని ఆరోపించారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిం చారని, అలాంటి వ్యక్తితో జగన్ అంటకాగుతున్నా రని అన్నారు. పసుపు- కుంకుమలు ఇచ్చేది చంద్రబాబు అయితే.. తుడిచేసే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. సీఎం కొడుకుగా లక్ష కోట్లు కొట్టేసిన జగన్.. సీఎం అయితే ప్రజల దగ్గరున్న బంగారం కూడా దోచేస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలే జగన్ కు బుద్ధి చెబుతారని, ఫ్యాను మాడి మసైపోతుందని అన్నారు.

 

Latest Updates