నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం షెడ్యూల్..

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో, మధ్యాహ్నం 2.30 గంటలకు ఉదయగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు జిల్లా వినుకొండలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7.30 గంటలకు నరసరావుపేటలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించనున్నారు.

Latest Updates