ఇవాళ చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్  సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇవాళ(గురువారం) గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించి, ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ప్రకాశం జిల్లాలో ఎన్నిక‌ల‌ ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. మధ్యాహ్నం 1.45 గిద్దలూరు ప్రచారంలో పాల్గొననున్నారు. తర్వాత 3.30 గంటలకు మార్కాపురంలో, సాయంత్రం 5 గంటలకు అద్దంకిలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం  6.30 గంటలకు గుంటూరు జిల్లా బాపట్లలో, రాత్రి 8.30 గంటలకు ప్రత్తిపాడులో చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Latest Updates