ఇల్లు ఖాళీ చేయండి.. చంద్రబాబుకు మళ్లీ నోటీసు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి … ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నోటీసులు పంపింది. ఉండవల్లి గ్రామ వీఆర్వో …. బాబు ఇంటికి వెళ్లి నోటీసుల గురించి సమాచారం ఇచ్చారు. కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉందని.. వరద ఉధృతి పెరుగుతోందని నోటీసుల్లో ప్రస్తావించారు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు. కానీ చంద్రబాబు ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో నోటీసులు గోడకు అంటించి వచ్చారు.
చంద్రబాబు ఇంటి దగ్గర పంట పొలాలు నీట మునిగాయనీ… ఇంటి దగ్గర ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. .

Latest Updates