ఇవాళ, రేపు కర్నూలులో బాబు ప్రచార షెడ్యూల్ ఇదీ

కర్నూలు: ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో కలసి ఆయన కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారు. ఉదయం కడప జిల్లాలో పర్యటన తర్వాత.. మధ్యాహ్నం 1 గంటకు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ కు వెళ్తారు. అక్కడ రోడ్డు షో లో పాల్గొంటారు. ఆళ్లగడ్డ జంక్షన్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సాయంత్రం 4 గంటలకు నంద్యాలలో పర్యటిస్తారు చంద్రబాబు. నంద్యాల పట్టణంలో రోడ్డు షో.. శ్రీనివాస సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు కర్నూలు పట్టణానికి చేరుకుంటారు. APSP మైదానం నుండి రాజవిహార్, కిడ్స్ వరల్డ్, ఉస్మానియా కాలేజీ, వన్ టౌన్, పూలబజార్, చౌక్ బజార్, పెద్ద మార్కెట్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్డు షో చేస్తారు. కొండారెడ్డి బురుజు ఎదురుగా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు.

రాత్రికి కర్నూలు లోనే బస చేస్తారు చంద్రబాబు. తెల్లారి 27న ఉదయం10 గంటలకు ఎమ్మిగనూరులో రోడ్ షో నిర్వహించి.. మాచాని సోమప్ప సర్కిల్ లో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటకు పత్తికొండలో ప్రచారంతో కర్నూలు జిల్లా టూర్ ముగుస్తుంది.

Latest Updates