అమరావతే రాజధాని.. అడ్డుపడితే ఉద్యమిస్తాం

రాజధాని కోసం బస్సు యాత్ర చేస్తున్న జేఏసీని అడ్డుకోవడం దారుణమని అన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. గురువారం విజయవాడలో అమరావతి పరిరక్షణ కమిటి సమావేశంలో మాట్లాడిన బాబు… సెక్యురిటీ సమస్య పేరుతో బస్సు యాత్రను అడ్డుకొవద్దని ప్రభుత్వానికి సూచించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జగన్ ముద్దులు పెడుతూ పాదయాత్ర చేసినా తాను అడ్డకోలేదని అన్నారు. ఎట్టిపరిస్థిలో మచిలీపట్నం యాత్రను జరిపితీరుతామని అన్నారు.

ఇప్పటి వరకు అమరావతి కోసం 11మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు చంద్రబాబు. బస్సుయాత్రకు ప్రభుత్వం అడ్డుపడితే ఉద్యమం ఉదృతమవుతుందని తెలిపారు. పరిపాలన అమరావతిలో కొనసాగించడానికి ఏమికావాలో అన్నీ ఇక్కడే ఉన్నాయని అన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగివుంటే హైకోర్టు జడ్జితో విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజధాని అమరావతే అనే ప్రకటన వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన అన్నారు.

Latest Updates