రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈవీఎంలు, వీవీపాట్ స్లిప్స్ లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పు, ఈసీ అనుసరిస్తున్న వైఖరిపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తొలి ఐదు దశల ఎలక్షన్ ట్రెండ్ పైనా భేటీలో చర్చించినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తయ్యాక అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లే విషయంపై సమాలోచనలు జరిపారు. నిన్న సాయంత్రమే రాహుల్ తో చంద్రబాబు భేటీ అవ్వాల్సి ఉండగా… రాహుల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఇవాళ సమావేశమయ్యారు.

Latest Updates