తెలంగాణ నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకరావడం అన్యాయం..

chandrababu-naidu-about-godavari-water-to-srisailam

తెలంగాణ నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకవస్తామనడం అన్యాయమని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న టీడీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన… ఆంధ్ర భూభాగం నుంచే శ్రీశైలానికి నీళ్లు ఇవ్వాలన్నారు. ఏపీ సీఎం జగన్- తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అన్నారు. స్వార్ధ నిర్ణయాలతో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీయొద్దన్నారు. ప్రజల స్వేచ్చను హరించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని చంద్రబాబు తెలిపారు.

సీఎం జగన్ పులివెందుల పంచాయతీలు చేయాలనుకుంటే కుదరదని అన్నారు చంద్రబాబు. వత్తిళ్లకు లొంగి వైసీపీ దాడులను పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. స్పీకర్ తన హుందాతనాన్ని నిలుపుకోవాలని చెప్పారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటిన్లను మూసివేశారని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను జగన్ నిలివేశారని బంరబాబు అన్నారు.

Latest Updates