ఢిల్లీలో చంద్రబాబు 12 గంటల ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

ఢిల్లీ వేదికగా ధర్మ పోరాట దీక్షను చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఆయన ఒకరోజు దీక్ష మొదలుపెట్టారు. ఈ ఉదయం రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు చంద్రబాబు. ఆ తర్వాత పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి.. ఏపీ భవన్ కు వెళ్లి అక్కడ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. 12 గంటలపాటు ధర్మపోరాట దీక్ష ప్రారంభించారు.

చంద్రబాబు దీక్షలో పాల్గొనేందుకు ఆంధ్రనుంచి రెండు రైళ్లలో 2 వేల మందికి పైగా టీడీపీ కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి దీక్షకు మద్దతు పలికారు. ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంప్లాయిస్ అసొసియేషన్ సభ్యులు, పలు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కు చెందిన లీడర్లు, పార్టీ వర్కర్లు దీక్షలో పాల్గొంటున్నారు. రాత్రి 8గంటల వరకు ఈ ఈ దీక్ష కొనసాగుతుంది.

Latest Updates