కావాలనే వరదలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు: బాబు

వరద నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ లో  మాట్లాడారు చంద్రబాబు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణను దాటి వరద వచ్చినా వైసీపీ ప్రభుత్వం  జాగ్రత్తలు తీసుకోలేదని అన్నారు. ఎక్కడ ఎంత వరద వస్తే ఏం చేయాలో తెలియలేదని.. కాళీగా ఉన్న రిజర్వాయర్లను నింపడంలో ప్రభుత్వం విఫలం అయిందని చెప్పారు. వరద నియంత్రనను గాలికి వదిలేసి వైసీపీ నేతలందరు తన ఇంటిచుట్టే తిరిగారని ఎద్దేవా చేశారు.

కరకట్టపై ఉన్న తన నివాసాన్ని టార్గెట్ చేయడమే వైసీపీ లక్ష్యంగా ఉందని చెప్పారు చంద్రబాబు. తన నివాసం మునిగిందని చూపెట్టడానికే వరద నిర్వహనను సరిగ్గా చేయలేదని అన్నారు. తనపై కక్ష తోనే లక్షలాది ప్రజలను వరదల్లో ముంచేశారని… కట్టుబట్టలతో నిరాశ్రయులను చేశారని ఆరోపించారు. దీనిని ‘మనిషి చేసిన విపత్తు’గానే చూడాలని… ఈ ‘మేన్ మేడ్ డిజాస్టర్’ కు బాధ్యత వైసిపిదే అని చెప్పారు.

ప్రపంచ దేశాలు ఏపికి దూరం అయ్యాయి: చంద్రబాబు
కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్ అమెరికా వెళ్లారని పాలనలో సీరియస్ నెస్ లేదని అన్నారు చంద్రబాబు.  జగన్ ‘‘ప్రభుత్వమే టెర్రరిజం’’ చేస్తోందని మోహన్ దాస్ పాయ్ చెప్పారని అన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో ఏపిని నాశనం చేస్తున్నారని తెలిపారు. ఏపి ప్రభుత్వాన్ని ఇప్పటికే జపాన్,ఫ్రాన్స్ హెచ్చరించాయని…  ప్రపంచ దేశాల్లో అనేకం ఏపికి దూరం అయ్యాయి అన్నారు చంద్రబాబు. వైసిపి బెదిరింపులు, వేధింపులతో రాష్ట్రానికి అపార నష్టం వాటిళ్లిందని… విపత్తులు వచ్చినప్పుడు టిడిపి ప్రభుత్వం చాలా కేర్ తీసుకుందని అన్నారు.

వరద బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు చంద్రబాబు. పకడ్బందీగా పునరావాస శిబిరాలను నిర్వహించాలని… బాధితులందరికీ నిత్యావసరాలు పంపిణీ చేయాలని….పసుపు,కంద,నిమ్మ,అరటి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. .టిడిపి నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Latest Updates