మేం రెచ్చిపోతే తట్టుకోలేరు జాగ్రత్త

ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.  అవమానం భరించలేకే  మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కోడెలది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. మంత్రులు బూతులు తిట్టడంలో పోటీపడుతున్నారని..వారిని బూతుల మంత్రులుగా పిలవాలన్నారు. వైఎస్ వివేకానందను ఇంటిదొంగలే చంపేసి సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు.

టీడీపీ నేతలపై దాడులు చేస్తుంటే సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అన్యాయంగా కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారని అన్నారు. దాడులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కొంతమంది పోలీసులు  ఓవర్ చేస్తున్నారని ..మేం రెచ్చిపోతే తట్టుకోలేరని అన్నారు.  లా అండ్ ఆర్డర్ తో ఆటలాడితే అది మీ పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు.

 

Latest Updates