సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా

chandrababu-resigns-as-ap-cm

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పదవికి  రాజీనామా చేశారు. తన మంత్రివర్గ రాజీనామాను ఆయన గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్  ఇ.ఎస్. ఎల్. నరసింహన్  బాబు రాజీనామాను ఆమోదించారు.

మరోవైపు ఏపీ ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మేజిక్ ఫిగర్(88) ని దాటి మరో 58 స్థానాల్లో అధిక్యంలో ఆ పార్టీ దూసుకెళ్తోంది. పార్టీ అధినేత జగన్ ఈ నెల 30 న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు.

Latest Updates