పోలవరం తీర్పుపై జగన్ ఇప్పుడేమంటారో..! : చంద్రబాబు

పోలవరం రివర్స్ టెండరింగ్ వద్దంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెపుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదనీ.. ఈ ఆలస్యం ప్రభావం ప్రాజెక్ట్ పై పడుతుందని అన్నారాయన.

ఏపీ ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో.. వైసీపీ రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్ధం కావడం లేదని మీడియాతో చిట్ చాట్ చేస్తూ అన్నారు చంద్రబాబు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచీ చెబుతూనే ఉన్నామనీ.. జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టుకు నష్టం కలుగుతుందన్నారు. కేంద్రం చెపుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి అర్ధం కావడం లేదన్నారు చంద్రబాబు.

లేని అవినీతిని నిరూపించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు చంద్రబాబు. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం ఉంటుందనీ.. అది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు.

Latest Updates