వరద ప్రాంతాల్లో రేపు చంద్రబాబు పర్యటన

అమరావతి : రేపు వరద ప్రాంతాలలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ తెలిపింది. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు.

వరద బాధితులను పరామర్శించి.. వారికి అందుతున్న సహాయంపై ఆరా తీస్తారు చంద్రబాబు. వరద నీట మునిగి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. పడవలు దెబ్బతిన్న మత్స్యకారులతోనూ చంద్రబాబు ముచ్చటిస్తారు.

Latest Updates