రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి చంద్రబాబు నివాళులు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఇవాళ ధర్మపోరాట దీక్షను ప్రారంభించనున్న చంద్రబాబు పార్టీ ఎంపీలతో కలిసి బస్సులో రాజ్‌ఘాట్‌ చేరుకున్నారు. నల్ల దుస్తులు ధరించి…. ఏపీ భవన్‌ నుంచి బస్సులో పార్టీ ఎంపీలు, మంత్రులు, నేతలతో కలిసి రాజ్‌ఘాట్‌ చేరుకున్నారు. తర్వాత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి తిరిగి ఏపీ భవన్‌కు బయల్దేరి వెళ్లారు. ఏపీ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత చంద్రబాబు ధర్మపోరాట దీక్షను ప్రారంభిస్తారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్రం అమలు చేయనందుకు నిరసనగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

Latest Updates