నేను లోకేశ్ తండ్రినయితే నువ్వు జశోదాబెన్ భర్తవి : మోడీకి బాబు కౌంటర్

విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. లక్ష ఇళ్ల పట్టాలను పేదలకు పంచుతూ విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తనను లోకేశ్ తండ్రి అని అనడంపై సీరియస్ అయిన చంద్రబాబు… తాను లోకేశ్ తండ్రి అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఐతే…ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కుటుంబ బంధాల విలువ తెలియదన్నారు. ముస్లిం మహిళల సంక్షేమం పేరుతో.. ట్రిపుల్ తలాఖ్  బిల్లు తెచ్చిన ప్రధానమంత్రి… తన కుటుంబం నుంచి విడిపోవడాన్ని ప్రస్తావించారు. తాను లోకేశ్ తండ్రి అయితే… ప్రధానమంత్రి మోడీ జశోదా బెన్ భర్త అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని విమర్శించారు. తన కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి తాను కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధగా అనిపిస్తోందని అన్నారు.

Latest Updates