శివప్రసాద్‌ పరిస్థితి విషమం… చంద్రబాబు పరామర్శ

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు… మాజీ ఎంపీ శివప్రసాద్ ను హాస్పిటల్ పరామర్శించారు. అనారోగ్యంతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ను చంద్రబాబు ఈ సాయంత్రం పరామర్శించారు. శివప్రసాద్ కు అందుతున్న ట్రీట్ మెంట్ వివరాలను డాక్టర్లతో మాట్లాడి తెల్సుకున్నారు.

చెన్నై అపోలో హాస్పిటల్ లో శివప్రసాద్ ను మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతా మోహన్ పరామర్శించారు. హాస్పిటల్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. శివప్రసాద్ కు అత్యవసర చికిత్స కొనసాగుతోందని చెప్పారు. శివప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కొంత విషమంగా ఉందని చెప్పారు మాజీ ఎంపీ చింతా మోహన్. అయితే ఆయన మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిని శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు.

chandrababu-visitation-to-chennai-apollo-hosptal-to-enquire-ex-mp-shivaprasad-health-conditions

Latest Updates