వరద నియంత్రణలో జగన్ ఫెయిల్.. బాబు ఫైర్

వరదలను అంచనా వేయలేక… వరదలకు అడ్డుకట్ట వేయలేక ఏపీ సీఎం తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ కు రాసిన లెటర్ లో పలు అంశాలపై సూచనలు చేస్తూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం, అనుభవరాహిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. వరద సహాయక చర్యల్లోనూ నిర్లక్ష్యం చేశారనీ.. వరద బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బందిపెట్టాలని.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వరదల పట్ల నిర్లక్ష్యం చూపిందని.. దీనిని జనం ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

 

గుంటూరు, కృష్ణా  జిల్లాల లంక గ్రామాల్లో జనం అష్టకష్టాలుపడ్డారనీ.. తమలపాకు, మొక్కజొన్న, పసుపు, అరటి, కంద, చెరుకు, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. దెబ్బ తిన్న పంటలకు, ఇళ్లకు పరిహారం వెంటనే అంచనావేసి.. కేంద్రం సహాయంతో వరద సాయాన్ని మంజూరు చేయాలన్నారు. గత ప్రభుత్వాలు వరదలను ఎదుర్కొన్న పద్ధతులను పరిశీలించాలని.. వరదలప్పుడు ఎలా వ్యవహరించాలో అధికారులను అడిగి తెల్సుకోవాలని జగన్ ను కోరారు చంద్రబాబు.

Latest Updates