బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి చంద్రశేఖర్

కాంగ్రెస్‌ మాజీ మంత్రి డా.ఏ.చంద్రశేఖర్ బీజేపీలో చేరారు. వికారాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడారు… గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం​ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందన్నారు. సర్పంచ్ ని…కలెక్టర్‌ సస్పెండ్‌ చేసే జీవో తెచ్చిన కేసీఆర్‌..సీఎంను కూడా సీఎస్‌ సస్పెండ్‌ చేసే జీవో తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌… ఆత్మహత్య చేసుకుంటా అన్నారు.. ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్‌ ను చార్మినార్ జోన్‌లో కలపాలన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Latest Updates