చంద్రుడిపై దిగబోతుండగా సిగ్నల్​  ఆగింది!

  • శనివారం తెల్లవారుజామున 1.51 గంటలకు ఆగిన ల్యాండర్ విక్రమ్
  •  చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో ఉండగా సిగ్నల్స్ కు అంతరాయం
  • డేటాను అనలైజ్ చేస్తున్నా మన్న ఇస్రో చైర్మన్ శివన్
  • సైంటిస్టు లకు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ
  • వారి కృషిని చూసి దేశం గర్విస్తోం దంటూ అభినందన
  • ఆఖరి క్షణం వరకు ఉత్కంఠగా చూసిన యావత్ భారతం
  • ల్యాండర్​ విక్రమ్ పరిస్థితిపై సస్పెన్స్​

శ్రీహరికోట: ‘‘ఆ 15 నిమిషాలు టెర్రర్’’ .. ఇస్రో చైర్మన్​ శివన్​ ముందుగా చెప్పి న మాట ఇది. ఆయన అన్నట్టే ఆ టైం నిజంగానే టెన్షన్​ పెట్టిం ది. ల్యాండిం గ్ ను దగ్గ-రుండి చూస్తున్న సైంటిస్టుల మొహాలు ఆందోళనతో నిండిపోయాయి. అప్పటివరకు అంతా బాగానే ఉంది అనుకుంటుం డగా ఆఖరు క్షణంలో విక్రమ్ నుంచి సిగ్నళ్లు కట్ అయ్యాయి . దాని నుంచి సమాచారం రాలేదు. ఇంకో 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా,విక్రమ్ సిగ్నల్ లేకుండా ఉండిపోయింది. దీంతో మిషన్​ కంట్రోల్ సెంటర్ సైంటిస్టులు మళ్లీ కనెక్టివిటీ కోసం ప్రయత్నించారు. అయినా , స్పందన రాలేదు.

చివరి క్షణంవరకు..

ముందు అనుకున్నట్టే శుక్రవారం అర్ధరాత్రి దాటాక(శనివారం) 1.39 గంటలకు విక్రమ్ ను కిందకు దింపే ప్రయోగాన్ని ప్రా రంభించారు. మూడుఫేజులుగా ల్యాండింగ్ ను విభజించారు. రఫ్ బ్రేకింగ్ఫేజ్ , నావిగేషన్​ కంట్రోల్ ఫేజ్ , ఫైన్​ బ్రేకింగ్ ఫేజ్లుగా విక్రమ్ ల్యాండిం గ్ కు ప్రయత్నించారు. రఫ్ బ్రేకింగ్ ఫేజ్ లో భాగంగా సైంటిస్టులు అనుకున్న-ట్టు గానే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ను7.4 కిలోమీటర్ల దూరానికి తీసుకొచ్చారు. దాదాపు 6నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియ సక్సెస్ అయింది.దీంతో సైంటిస్టులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆతర్వాత 1.45 గంటలకు నావిగేషన్​ కంట్రోల్ ఫేజ్ నుప్రారంభించారు. ఈ ఫేజ్ లో విక్రమ్ స్పీడ్ ను మరింత తగ్గించారు. ఆ ఫేజ్ పూర్తయ్యే సరికి వేగాన్ని సెకనుకు 60 మీటర్లకు తగ్గించారు. ఇందులో విక్రమ్ ఎత్తును7.4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లకు తగ్గించారు.తర్వాత ఫైన్​ బ్రేకింగ్ ఫేజ్ లో భాగంగా 5 కిలోమీటర్లనుంచి 400 మీటర్లకు తగ్గించే ప్రయత్నం చేశారు.అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న టైంలో 2.1కిలోమీటర్ల దూరంలో ఉందనగా గ్రౌండ్ కంట్రోల్ తోవిక్రమ్ సంబంధాలు కట్ అయిపోయాయి. దీంతో సైంటిస్టుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. విక్రమ్ నుంచి సిగ్నళ్లు వస్తాయే మోనని ఎదురు చూశారు.కానీ, అలాంటిదేమీ జరగలేదు. మధ్యలో చంద్రయా-న్​ 2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ డేటాను తెలుసుకునే ప్ర-యత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్బిటర్ తో విక్రమ్ నుంచి డేటా వెళ్లినట్టు గుర్తించారు. విక్రమ్ నుంచిఎలాంటి స్పం దనా లేకపోవడంతో సైంటిస్టులతోపాటు యావత్ దేశ ప్రజలు ఉద్వేగానికి లోనయ్యా-రు. దాదా పు 2.1 కిలోమీటర్ల దూరం నుంచి సిగ్నల్ బంద్ కావడం, అరగంటైనా రాకపోవడంతో ఇస్రోచైర్మన్​ కే శివన్​ ప్రయోగంపై ప్రకటన చేశారు. ‘‘2.1కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ఆగిపోయింది. సిగ్నళ్లుకట్ అయ్యాయి . మళ్లీ కనెక్టివిటీ కోసం ప్రయత్నిస్తు-న్నాం” అని శివన్​ ప్రకటించారు.

ధైర్యంగా ఉండండి: ఇస్రో సైంటిస్టులతో ప్రధాని మోడీ

ఇస్రో ఆఫీస్ లోని సైంటి స్టు లు టెన్షన్ కు గురవడంతో ప్రధాని నరేంద్ర మోడీ వారితోమాట్లాడారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని, అంతాధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇప్పటిదాకా ఇస్రోసైంటి స్టు లు బాగా కష్టపడ్డారని మెచ్చుకున్నారు. ఇప్పటిదాకాసాధించింది చిన్న విషయమేం కాదన్నారు. సైంటిస్టు ల కృషిని దేశమంతా అభినందిస్తోందన్నారు. సైంటిస్టుల కృషిని మరోరోజు దేశం సంబరంగా జరుపుకుంటుందని ఓదార్చారు. తాను అండగా ఉంటానన్నారు. మున్ముందు అంతా మంచే జరగాలని కోరుకుందామన్నారు.

Latest Updates