జూలైలో చంద్రయాన్‌‌–2

చంద్రయాన్‌‌–2కు ముహూర్తం కుదిరింది! ఈ ఏడాది జూలై 9–16 మధ్య ప్రయోగానికి రెడీ అవుతున్నట్టు ఇస్రో బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్‌‌ 6కల్లా చంద్రుడిపై ల్యాండర్‌‌, ఆర్బిటర్‌‌, రోవర్‌‌ దిగొచ్చని తెలిపింది. జీఎస్‌‌ఎల్‌‌వీ ఎంకే-3 రాకెట్‌‌ ద్వారా ఈ ప్రయోగం చేస్తామని, చంద్రుడి సౌత్‌‌పోల్‌‌ ప్రాంతంలో రోవర్‌‌ ఎక్స్‌‌పెరిమెంట్లు చేస్తుందని వెల్లడించింది. 2008లో చంద్రయాన్‌‌–1 ప్రయోగించిన ఇస్రో చంద్రయాన్‌‌–2పై గత మూడేళ్లుగా పనిచేస్తోంది. ఖనిజాలు, హీలియం–3 జాడ కోసం చంద్రయాన్‌‌–2 పనిచేయనుంది.

Latest Updates