చంద్రయాన్ ఫెయిల్ అయినా.. ఈ సూర్యుడి విజయంపై ధీమా

  • శిసేనన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రయాన్-2 ప్రస్తావన తెచ్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. చంద్రయాన్-2 మిషన్ తో ఆ పార్టీ నేత ఆదిత్య ఠాక్రే పోటీకి లింక్ పెట్టి మాట్లాడారు.

‘ఇస్రో పంపించిన చంద్రయాన్-2 కొన్ని సాంకేతిక కారణాల వల్ల చంద్రుడిపై లాండ్ కాలేకపోయింది. కానీ మా సూర్యుడు (ఆదిత్య ఠాక్రే) కచ్చితంగా విజయం సాధిస్తారన్న ధీమా మాకుంది. అక్టోబరు 21 మంత్రాలయంలోని ఆరో ఫ్లోర్ (ముఖ్యమంత్రి కార్యాలయం)కు చేరుకుంటారు’ అని సంజయ్ రౌత్ అన్నారు.

Latest Updates