చంద్రయాన్2 ఆర్బిటర్ సేఫ్.. చంద్రుడి ఉపరితలంపై మ్యాపింగ్

chandrayaan-2-orbiter-successfully-working-around-moon-283605-2

చంద్రయాన్ 2 ఆర్బిటర్ లూనార్ కక్ష్యలో సేఫ్ గా తిరుగుతోందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మిషన్​లో  ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండ్ రోవర్​తో మాత్రమే గ్రౌండ్ స్టేషన్ సంబంధాలు కోల్పోయిందని ఇస్రో అధికారులు శనివారం ప్రకటించారు. ఆర్బిటర్ మాత్రం చెక్కుచెదరకుండా చంద్రుడి కక్ష్యలో పనిచేస్తోందని చెప్పారు. 2,379 కిలోల బరువున్న ఈ ఆర్బిటర్.. ఏడాది పాటు చంద్రుడికి 100 కిలో మీటర్ల ఎత్తులో తిరుగుతూ రిమోట్ సెన్సింగ్ అబ్జర్వేషన్లు నిర్వహిస్తుందని తెలిపారు. పదేళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్ 1 మిషన్​కు ఫాలో ఆన్ మిషన్ అయిన చంద్రయాన్ 2లో ఆర్బిటర్, ల్యాండర్(విక్రమ్), రోవర్(ప్రగ్యాన్) ఉన్నాయి. ఎనిమిది సైంటిఫిక్ పేలోడ్లను కలిగి ఉన్న ఆర్బిటర్.. చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్ చేస్తుంది.

Latest Updates