రాత్రికి జాబిల్లిపై దిగనున్న చంద్రయాన్ 2

చంద్రయాన్-2 కీలక దశకు చేరుకుంది. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగేందుకు టైం దగ్గర పడుతోంది. ఇవాళ అర్ధరాత్రి 1 గంట నుంచి రెండు గంటల మధ్య చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించటం ప్రారంభమౌతుంది. రాత్రి ఒంటి గంట 30 నిమిషాల నుంచి రెండు గంటల 30 నిమిశాల మధ్య ఉపరితలంపై దిగనుంది. ల్యాండర్ లో ఉన్న రోవర్ ప్రజ్ఞ తెల్లవారుజామున నాలుగున్నార నుంచి ఐదున్నార మధ్య  బయటకు వచ్చి ఉపరితలంపై దిగనుంది.

ఇవాళ రాత్రి 1 గంట 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య విక్రమ్ ల్యాండర్ ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి… చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. 1 గంట 40 నిమిషాల నుంచి 1 గంట 55 నిమిసాల మధ్య అంటే 15 నిమిషాల పాటు ఈ ల్యాండింగ్  ప్రక్రియ జరగనుంది. అయితే 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే చంద్రుడిపై విక్రమ్  ల్యాండర్  దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనది.

విక్రమ్  ల్యాండర్ ను జాబిల్లిపైకి విజయవంతంగా చేర్చిన తర్వాత….ప్రజ్ఞాన్  రోవర్ … 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.  ఆ టైంలో అది విక్రమ్ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలతో ఇస్రో ఒక వీడియోను విడుదల చేసింది. మరోవైపు చంద్రయాన్-2 ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులు బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

Latest Updates