చంద్రయాన్ 2 : విక్రమ్ క్రాష్ లాండ్ అయింది ఇక్కడే

చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ క్రాష్ లాండ్ అయిన చోటును నాసా ఫోటోలు తీసింది. ఇస్రో లాండ్ చేయాలని టార్గెట్ చేసిన ప్రదేశం నుంచి నాసా ఆర్బిటార్ వెళ్లడంతో సెప్టెంబర్ 17న ఈ ఫోటోలు తీశారు నాసా శాస్త్రవేత్తలు. హైరెజల్యూషన్ చిత్రాలు ఉన్నా… షాడోల్లో విక్రమ్ ల్యాండర్ జాడ మాత్రం కనిపించలేదు. సరైన లైటింగ్ లేకపోవడంతో విక్రమ్ జాడ కనిపెట్టలేకపోయామని నాసా చెప్పింది. అక్టోబర్ లో ఇదే ప్రాంతం మీదిగా తమ ఆర్బిటార్ వెళ్తుందని, అప్పుడు లైటింగ్ కూడా బాగుంటుందని విక్రమ్ ఫోటోలను విడుదల చేస్తామని నాసా చెబుతోంది.

సెప్టెంబర్ 7న విక్రమ్ ను సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే చంద్రుడి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగా కనెక్టివిటీ కోల్పోయింది. సేఫ్ ల్యాండింగ్ టైంలో ల్యాండర్ సరైన దిశలో లేకపోవడంతో ఇంజన్లు బూస్టర్ లా పని చేసి వేగంగా చంద్రుడి ఉపరితలంపై పడిపోయినట్లు గుర్తించారు. ఆర్బిటర్ బాగా పని చేస్తోందని ఇస్రో చెబుతోంది.

Latest Updates