చంద్రయాన్-3 పనులు వేగంగా సాగుతున్నాయ్: ఇస్రో చీఫ్

బెంగుళూరు: చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, అందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్‌ కే శివన్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్ -3 ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చంద్రయాన్ -2లో ఉన్నట్టుగానే చంద్రయాన్–3 లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని ఆయన తెలిపారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలు ఉంటుందన్న శివన్.. చంద్రయాన్–3లోనూ దీనిని వినియోగిస్తామని చెప్పారు. చంద్రయాన్ 3 ల్యాండర్, క్రాఫ్ట్ ఖర్చు దాదాపు 250 కోట్లు కాగా, లాంఛ్‌కు 350 కోట్ల వ్యయమవుతుందని శివన్ వెల్లడించారు. మరోవైపు గగన్యాన్ మిషన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ నెలాఖరుకు శిక్షణ కోసం రష్యా వెళతారని చెప్పారు. 1984లో రాకేష్ శర్మ రష్యన్ మాడ్యూల్లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారత వ్యోమగాములు దేశీయంగా రూపొందించిన మాడ్యూల్లోనే భారత్ నుంచే అంతరిక్షంలోకి వెళతారని శివన్ తెలిపారు.

Chandrayaan-3 work going at full speed, says Isro chief K Sivan

Latest Updates