రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది అన్నదాతలు నిరసనలు తెలిపారు. అయితే ట్రికీ బార్డర్‌‌లో రైతులు బ్యారికేడ్లు తోసేయడంతో ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సంజయ్ గాంధీ ట్రాన్స్‌‌పోర్ట్ నగర్‌‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. సంజయ్ గాంధీ ఏరియా స్మోక్ ఛాంబర్‌లా కనిపిస్తోంది. రైతులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్‌‌ను కూడా ప్రయోగించారు. మధ్యాహ్నం 12 గంటలకు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమవుతుందని భావించినా.. ఉదయం 8 గంటలకే వేలాది మంది అన్నదాతలు బార్డర్స్ వద్ద గుమిగూడి నిరసనలు తెలపుతూ పరేడ్ నిర్వహించారు. ఢిల్లీతోపాటు రాజస్థాన్, హర్యానాల్లోనూ రైతులు ట్రాక్టర్ ర్యాలీలు తీస్తున్నారు.

Latest Updates