ప్రచారానికి సిద్ధమవుతున్న రథాలు

ఎన్నికల పర్వం లో ప్రచారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇందులో ప్రచార రథాలదే కీలక పాత్ర. రకరకాల పరిస్థితుల్లో క్యాంపెయిన్‍ చేయాల్సి ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైన వాహనాలను తయారు చేయించుకోవడానికి ప్రతినాయకుడు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో సిటీలో ప్రచార రథాలు ఆగమేఘాల మీద తయార వుతున్నాయి. కుత్బుల్లా పూర్ సూరారం పారిశ్రామికవాడలో ఎస్.ఎస్.ఇండస్ట్రీస్ ప్రచార రథాల తయారీకి పెట్టింది పేరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ ప్రచార రథాల తయారీ జోరుగా సాగుతుంది. ఈసారి ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో వేగంగా రథాలు తయారవుతున్నాయి. ఒక్కోవాహనాన్ని తయారు చేయడానికి సుమారు రూ.2.50ల వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు .

Latest Updates