ఛార్మి మొదటి సంపాదన..?

చామింగ్ గర్ల్ ఛార్మి కౌర్ సినీ కెరీర్ స్టార్ట్ చేసి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా ఛార్మి ప్రేక్షకులకు ,అభిమానులకు ఓ పోస్ట్ చేసింది.  సరిగ్గా 18 ఏళ్ల క్రితం 2001 మే 27 న మొదటి సారిగా కెమెరా ముందుకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. తాన కెమెరా ముందు ఉన్నప్పుడు తన చుట్టూ 500 క్యారెక్టర్ ఆర్టిస్టులు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారని అది తనకొక కొత్త ప్రపంచంలా కనిపించిందని చెబుతోంది.

మొదటి రోజు షూటింగ్ కు తన బ్రదర్  ముంబయిలోని మోహబూబా స్టూడియోకు తీసుకుని వదిలిపెట్టాడని గుర్తు చేసుకుంది. తన మొదటి రెమ్యునరేషన్ రూ.200 తీసుకున్నానని..అప్పటి నుంచి తను హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఛార్మి చెప్పింది. తన ఫ్యామిలీ ప్రోత్సాహంతో తన కెరీర్లో ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందెకెళ్తున్నానంటూ చెప్పుకొచ్చింది. తర్వాత నిర్మాతగా మారి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీస్తున్నానని జులై 19 న రిలీజ్ అవుతుందని వెల్లడించింది ఛార్మి.

Latest Updates