ప్లేయర్ల కోసం చార్టెడ్‌ ఫ్లైట్స్‌.. హోటల్‌ బుకింగ్స్‌!

న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్‌‌‌‌ను యూఏఈలో నిర్వహించే ఆలోచన ఉందని బీసీసీఐ అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఇలా వార్తను బయటపెట్టిందో లేదో.. ఫ్రాంచైజీలన్నీ లీగ్‌‌‌‌ కోసం సిద్ధమైపోతున్నాయి. అందులో భాగంగా దుబాయ్‌‌‌‌ వెళ్లడానికి చార్టెడ్‌‌‌‌ ఫ్లయిట్స్‌‌‌‌, ప్లేయర్ల కోసం హోటల్స్‌‌‌‌ను బుక్‌‌‌‌ చేసుకుంటున్నాయి. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా ముందు జాగ్రత్తగా తమ టీమ్‌‌‌‌ల కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాయి. అబుదాబిలో ఇప్పటికే తమ టీమ్‌‌‌‌ కోసం ఓ హోటల్‌‌‌‌ను బుక్‌‌‌‌ చేశామని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి వెల్లడించారు. ‘ఇలాంటి విషయాల్లో దూకుడు అవసరం. జట్టు అవసరాలు మాకు చెప్పారు. వాటికి అనుగుణంగా మేం హోటల్‌‌‌‌ను బుక్‌‌‌‌ చేశాం. ఇక్కడి నుంచి యూఏఈకి వెళ్లిన తర్వాత క్వారంటైన్‌‌‌‌లో ఉండాలి. దానికి అనుగుణంగా మా ప్లాన్స్‌‌‌‌ను రెడీ చేసుకుంటున్నాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు. మరోవైపు క్వారంటైన్‌‌‌‌ను తాము ఇండియాలోనే పూర్తి చేయాలనుకుంటున్నామని మరో ఫ్రాంచైజీ వెల్లడించింది. దీనివల్ల ఖర్చుతో పాటు టైమ్‌‌‌‌ కూడా కలిసొస్తుందని చెప్పింది. యూఏఈ వెళ్లాక నేరుగా ప్రాక్టీస్‌‌‌‌కు వెళ్లిపోవచ్చంది. ‘ప్రస్తుతం ప్లేయర్లతో పాటు స్టాఫ్‌‌‌‌ అంతా ఇళ్లలోనే ఉంది. అయితే వీరిలో కొంత మందికి లక్షణాలు ఉండకపోవచ్చు. కాబట్టి టీమ్‌‌‌‌ను ఓ చోటకు చేర్చాక కరోనా టెస్ట్‌‌‌‌లు నిర్వహిస్తాం. బయో సెక్యూర్‌‌‌‌ వాతావరణంలో ఉంచి యూఏఈకి తీసుకెళ్తాం’ అని ఆ ఫ్రాంచైజీ వివరించింది. ఆగస్ట్‌‌‌‌ వరకు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ అందుబాటులోకి వస్తాయో లేదో తెలియకపోవడంతో.. చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ను ఎంచుకున్నామని ఓ ఫ్రాంచైజీ ట్రావెల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ అధికారి తెలిపాడు. ఈజీగా 30, 40 మంది ట్రావెల్‌‌‌‌ చేయొచ్చన్నాడు. తమ టీమ్ అంతా యూఏఈలో నే కలుస్తుందని మరో ఫ్రాంచైజీ వ్యక్తి చెప్పారు. ‘ మా క్రికెటర్లను ఫస్ట్ క్లాస్‌‌‌‌లో పంపాలని అనుకుంటున్నాం. అందులో మనిషికి మనిషికి దూరం ఉంటుంది. పైగా మేమంతా యూఏఈలో నే కలుస్తాం. ఇక్కడి నుంచి ఎవరికి వాళ్లు యూఏఈ వస్తారు. అందువల్ల చార్టెడ్ ఫ్లయిట్స్అరేంజ్ చెయ్యలేము. నార్మల్ ఫ్లైట్స్ లేనిపక్షంలో చార్టెడ్ ఫ్లయిటే ఏర్పాటు చేసుకుంటాం’ అని చెప్పుకొచ్చారు.

For More News..

 సర్కారీ జూనియర్ కాలేజీలపై సర్కారుకు నో ఇంట్రెస్ట్

Latest Updates