చికెన్ సెంటర్ నిర్వాహకురాలిని వెంటాడి.. గొడ్డలితో నరికి చంపిన అగంతకుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  మణుగూరు అంబేద్కర్ సెంటర్లో లో చికెన్ షాప్ నిర్వాహిస్తున్న మహమ్మద్ మెహబూబ్ పాషా బార్య హబీబ్ బేగం (40) హత్యకు గురైంది. ఉదయం మంచినీళ్ళు తీసుకొని వస్తుండగా అమెను వెనుక నుండి ఫాలో అయిన  గుర్తు తెలియని వ్యక్తి  హఠాత్తుగా గొడ్డలితో దాడి చేసి విచక్షణా రహితంగా నరకడంతో హబీబ్ బేగం రక్తపు మడుగులో పడిపోయి గిల గిల కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తుతెలియని ఆగంతకుడు వెంటనే పరరయ్యాడు. పోలీసుస్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక  ప్రజలు ఒక్కసారి గా భయందోళనకు గురయ్యారు.

          మృతురాలు గత 15 ఏండ్లుగా భర్తతో కలిసి చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.  హబీబ్ బేగం మృతితో వీరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.  అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ షుకూర్ తెలిపారు.

Latest Updates