డబుల్ బెడ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసం.. చీటర్ అరెస్ట్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతున్న  ఓ వ్యక్తిని మాదాపూర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు.  నెల్లూరు జిల్లాకు చెందిన కూనంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి … డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ జనాన్ని మోసం చేశాడు. కిరణ్ కుమార్.. ఎంబీఏ వరకు చదివాడు. సిటీలోని మాదాపూర్, దుండిగల్, చందనగర్ పరిధిలో … 55 మంది దగ్గర రూ.10 లక్షలు వసూలు చేశాడు. సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ తనకు తెలుసు అనీ… డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని జనాన్ని నమ్మించి.. ఒక్కొక్కరి నుంచి 10 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేశాడు. ఇతని నుంచి 8లక్షల నగదు, బైక్, సెక్యురిటీ మేనేజర్ ఆపరేషన్ ఐడి కార్డ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ప్రభుత్వ పథకాలకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థలు , వెబ్ సైట్లలో సమాచారం ఉంటుందని.. మధ్యవర్తులను నమ్మాల్సిన అవసరం లేదని సీపీ సజ్జనార్ చెప్పారు.

Latest Updates