లోన్లు ఇస్తామని రూ.25కోట్లకు టోకరా

హైదరాబాద్ : లోన్స్  మంజూరు చేస్తామంటూ మోసం చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 62 మంది నిందితులు… ఓ ముఠాగా ఏర్పడి రెండు కాల్ సెంటర్లను పెట్టారు. కొంత అమౌంట్ కడితే.. పెద్దమొత్తంలో లోన్లు ఇస్తామంటూ మభ్యపెట్టి వారినుంచి డబ్బులు గుంజారు. 600 మందిని ట్రాప్ చేసి.. రూ.25కోట్ల వరకు వారిని మోసం చేశారు. పక్కా సమాచారంతో రెండు కాల్ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. కంప్యూటర్లు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు.

Latest Updates