బాలీవుడ్ నటిపై చీటింగ్ కేసు

బాలీవుడ్ న‌టి అమీషాప‌టేల్‌పై ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ చీటింగ్ కేసు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ లో ఓ ఈవెంట్ సంస్థ ప్రతినిధి పవన్‌ శర్మ, అమీషా పటేల్ తో డీల్ కుదుర్చుకున్నారు. పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు రూ. 11 లక్షలను అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు. అయితే… అమీషా ఈ సెలబ్రేషన్ కు హాజరు కాలేదని, మరో రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని పవన్ ఆరోపించారు.. అమీషా వ్యవహారంతో చాలా ఇబ్బందులు పడ్డానని, డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అడిగితే, చంపేస్తానని బెదిరింపులకు దిగిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అమీషా సహా మరికొందరిపై FIR దాఖలు చేశారు. మార్చి 12లోగా కోర్టుకు హాజరు కావాలని అమీషాకు నోటీసులు పంపారు.

Latest Updates