అజారుద్దీన్‌‌‌‌పై చీటింగ్‌‌‌‌ కేసు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇండియన్ క్రికెట్ టీమ్‌‌‌‌ మాజీ కెప్టెన్, హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు అజారుద్దీన్‌‌‌‌పై చీటింగ్‌‌‌‌ కేసు నమోదైంది. ఆయనతోపాటు ముజీబ్ ఖాన్, సుదేశ్ అవిక్కల్‌‌‌‌ అనే మరో ఇద్దరుపై మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌‌‌లో ఓ ట్రావెల్‌‌‌‌ కంపెనీ ఈ కేసు పెట్టింది. రూ.20 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ అదే రాష్ట్రానికి చెందిన దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని మహ్మద్ షాదాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమాన ప్రయాణాలకు తన ట్రావెల్స్ నుంచి అజారుద్దీన్‌‌‌‌ టికెట్లు బుక్ చేయించారని అందులో పేర్కొన్నారు. ఈ మొత్తం సుమారు రూ.20 లక్షల వరకు అయిందని.. ఆ డబ్బులు ఇవ్వడంలేదని వివరించారు. అయితే ఇవన్నీ వాస్తవాలుకావని అజారుద్దీన్‌‌‌‌ అన్నారు. ‘నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కోర్టుకెళ్తా. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా’ అని అన్నారు.

Latest Updates