ప్లాస్మా పేరుతో చీటింగ్..

కరోనా బాధితుల నుంచి వేలల్లో వసూలు

నిందితుడు సందీప్ ను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్ మెంట్ లో మంచి ఫలితాలిస్తున్న ప్లా స్మా ను డొనేట్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు వందల మంది కరోనా బాధితుల నుంచి అతను రూ. 300 నుంచి రూ. 40 వేల వరకువసూలు చేసినట్లు గుర్తించారు. ప్రజల్లో కరోనా పట్ల భయాన్ని నిం దితుడు  క్యాష్ చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఇతని చేతిలో మోసపోయిన బాధితులు కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిం దితున్ని పట్టుకున్నారు.

టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ జి. చక్రవర్తి వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజం పొనుగుటివలస కు చెందిన నిందితుడు సందీప్ (25) డిగ్రీ చదివాడు. ఉద్యోగం లేకపోవటంతో దొంగతనాలకు పాల్పడుతూ రెండు సార్లు జైలుకు వెళ్లా డు. ఇటీవల కరోనా తో ప్రజల్లో ఏర్పడిన భయాన్ని క్యాష్ చేసుకోవాలని భావించాడు. మొదట కరోనా పేషెంట్లకు ఇచ్చే టోసిలిజుమాబ్ 400 ఎంజీ డ్రగ్‌ సప్లయ్ చేస్తానంటూ కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ప్లాస్మా కు డిమాండ్ ఉందని గుర్తించి ప్లాస్మా కోసం సెర్చ్ చేస్తున్న పేషెంట్లను టార్గెట్ చేశాడు.

ప్లా స్మా డొనేట్ చేస్తానంటూ నిందితుడు సందీప్ ప్లా స్మా అవసరమైన వారిని సోషల్ మీడియా ద్వారా గుర్తించేవాడు. వారికి ఫోన్లు చేసి తాను కరోనా నుంచి కోలుకున్నానని ప్లా స్మా ఇస్తానంటూ చెప్పేవాడు. వచ్చేం దుకు ట్రావెలింగ్ చార్జీల కోసం రిక్వెస్ట్ చేసేవాడు. ఇలా బంజారాహిల్స్‌‌కి చెందిన ఓ వ్యాపారి దగ్గర ఏకంగా రూ. 40 వేలు వసూలు చేశాడు. పంజాగుట్టలో ఒకరి వద్ద రూ.17,000, రాంగోపాల్‌‌ పేట్‌‌ లో మరొకరి వద్ద రూ. 5,500 వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి టచ్ లో లేకుండా పోయాడు. ఏపీ, తెలంగాణలో ఇలా 200 మందికి పైగా కరోనా పేషెంట్లను ప్లా స్మా పేరుతో నిందితుడు సందీప్ చీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొ క్కరి నుంచి ట్రావెలింగ్ చార్జీల పేరుతో రూ. 300 నుంచి నుంచి వేలల్లో వసూలు చేసేవాడని చెప్పారు. నిందితున్ని తదుపరి విచారణ కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఐతే జనం ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Latest Updates