సరోగసి సంతానం పేరుతో మోసం

పిల్లలు లేని తల్లిదండ్రుల  బలహీనతను ఆసరాగా తీసుకుని డబ్బులను తీసుకుని మోసం చేసింది ఓ ప్రైవేట్ ఆస్పత్రి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. దీంతో వారు పిల్లల కోసం  సికింద్రాబాద్ లోని  సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను సంప్రదించారు. అద్దె గర్భం (సరోగసీ) విధానంలో సంతానం అందజేస్తామని ఆ ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత వారి నుంచి రూ. 10 లక్షల తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబరులో శిశువును అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సరోగసి మహిళ విశాఖపట్టణంలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు బిడ్డను ఇవ్వకలేదు.

అయితే ఇటీవల విశాఖపట్నంలోని ఇదే ఆస్పత్రిలో సరోగసి పేరుతో శిశు అమ్మకాలకు పాల్పడుతున్నట్లు న్యూస్ పేపర్లలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ దంపతులు సికింద్రాబాద్ లోని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌కు  వెళ్లడంతో  అసలు విషయం బయటపడింది. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates