షాద్ నగర్‌లో ఓ ఇంటి దాబాపై చిరుత హల్‌చల్

షాద్ నగర్ : చిరుతపులి ప్రజలను భయాందోళనకు గురి చేసిన సంఘటన షాద్ నగర్ లో జరిగింది. సోమవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న పులిని చూసి స్థానికులు పరుగులు తీశారు. చుట్టుపక్కలవారు పెద్దగా కేకలు పేయడంతో షాద్ నగర్, పటేల్ రోడ్డులోని మన్నే విజయ్ కుమార్ ఇంపైకి చేరింది. చుట్టు ప్రజలను గమినించిన చిరుత మిద్దెపై దర్జాగా పండుకుంది. 4 గంటలు పులి ఇంటిపైనే ఉండటంతో స్థానికంగా కలకలం రేపింది. ఏ క్షణాన ఏం చేస్తుందోనని స్థానికులు భయపడ్డారు.

సమాచారం అందుకున్న షాద్ నగర్  ఏసిపి సురేందర్.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన చిరుత స్పృహ కోల్పోయింది. తర్వాత పులిని బోనులో బంధించి జూ కు తరలించారు ఫారెస్ట్ అధికారులు. పులిని సేఫ్ గా పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు.

see also: 

ప్లానింగ్​ ఇట్ల కూడా : లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ లోన్లను త్వరగా తీర్చడం

ఫోన్​ రీచార్జ్​తో బీమా : రూ.2 లక్షల కవరేజ్

ప్రియురాలిని పెళ్లాడిన ‘ట్రిపుల్ సెంచరీ వీరుడు’

Latest Updates